Covid Bells: విదేశాల్లో కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు వైద్య రంగ నిపుణులు హాజరు కానున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రోజూవారీ పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే త్వరగా గుర్తించవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు లేఖ రాసింది. విదేశాల్లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో భారత్‌కు నాలుగో వేవ్ పొంచి ఉందని హెచ్చరించింది.
Earth Quake : కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు
టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కట్టడి అనే ఐదంచెల వ్యూహంతో భారత్ కరోనా నియంత్రణ వ్యాప్తిని సమర్థంగా నియంత్రించగలిగిందని వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో వారానికి 12 వందల కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కేంద్రం లేఖలో ప్రస్తావించింది. కొవిడ్ కొత్త వేరియంట్లను కట్టడి చేసేందుకు అనుమానితులను ముందస్తుగా గుర్తించి ఐసోలేట్ చేయడం అత్యంత ఆవశ్యకమని గుర్తించింది.