భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
పెరుగుతున్న కొవిడ్-19 కేసులను చూస్తుంటే, పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొవిడ్ కొత్త రూపాంతరం, JN.1 కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అంతే కాకుండా చలికాలంలో ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి.కృష్ణబాబు వెల్లడించారు. కొవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన మీడియాతో చెప్పారు.
JN.1గా గుర్తించబడిన కొత్త కొవిడ్-19 వేరియంట్ భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అధికారులు, సాధారణ ప్రజలలో భయాందోళనను కలిగిస్తోంది. JN.1 కోవిడ్ సబ్‌వేరియంట్ మొదటగా లక్సెంబర్గ్‌లో గుర్తించబడింది. ఇది పిరోలా వేరియంట్ (BA.2.86) వారసుడిగా పరిగణించబడుతోంది. దీని మూలాలు ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని, కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా భయాల నుంచి అందరూ బయటపడిన నేపథ్యంలో మళ్లీ కరోనా అని పేరు వినిపిస్తుండడంతో భయాందోళన కలుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు సూచనలు చేశారు.