దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లక్షణాల విషయంలో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మేదాంత హాస్పిటల్ వైద్యులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ సూచించారు.
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనానే అని పలు దేశాలు నిందించిన సంగతి తెలిసింది. ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
కొవిడ్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దాదాపు ఒక్క నెలలోనే కొవిడ్ సోకి 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నివేదించారు.
అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో వివిధ రకాల వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి.
చైనాతో పాటు పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
చైనా, థాయ్‌లాండ్‌తో సహా ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేయడానికి ముందు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల కోసం సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
కోవిడ్-19 వైరస్ చాలా దేశాల్లో విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
చైనాలో కరోనా కేసులు ఉల్క వేగంతో పెరుగుతూ ఉన్నాయి. వైరస్ బారిన పడిన ప్రజలు కోకొల్లలుగా మరణం బారిన పడుతున్నారు. ఆ దేశంలోని ఐసీయూల్లో ఆస్పత్రి బెడ్లు పేషంట్లతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి.