రెండు దశాబ్దాలకు పైగా జగపతి బాబు అభిమానిగా ఉన్న శ్రీను ఈ రోజు ఉదయం కరోనాతో గుంటూరులో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జగపతిబాబు తన సంతాపాన్ని తెలియచేశారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గానూ ఉన్న శ్రీను మరణం జీర్ణించుకోలేనిదని అన్నారు. విశేషం ఏమంటే… జగపతిబాబును ఎంతగానో అభిమానించే శ్రీను తన కుమారుడొకరికి జగపతి పేరునే పెట్టారు. శ్రీను కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపిన జగపతిబాబు, కరోనా కారణంగా కళ్ళ ముందు ఎంతో మంది…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారిన పడిన సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. తాజాగా దీపికాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దీపికా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఆమె డాక్టర్లు సూచించిన మందులు తీసుకుంటోంది. దీపికా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీపికా తల్లిదండ్రులు, చెల్లెలికి కరోనా సోకింది. దీపికా తండ్రి ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో…
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో ఈరోజు ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తీ బయో బబుల్ ధాటినట్లు తెలుస్తుంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు… అక్కడే అతనికి వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే…
ప్రముఖ నటుడు సాయికుమార్ తన చుట్టూ ఉన్న వారికి ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. కరోనా కష్ట కాలంలోనూ తన వంతు సాయం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయికుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, అది వేసుకుంటే ప్రాణాలకు ఢోకా ఉండదని హితవు పలికారు. ‘పోలీస్ స్టోరీ’లోని పాపులర్ డైలాగ్ ను ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ…
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత అందరినీ అల్లాడిస్తోంది. హాస్పిటల్స్ లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో కొవిడ్ పేషంట్స్ కన్నుమూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫిల్మ్ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. మరికొందరు కరోనాకు సంబంధించిన బాధితుల సమాచారాన్ని వీలైనంత మందికి తెలియచేయడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు హర్షవర్థన్ రాణే మరో అడుగు ముందుకేశాడు. కరోనా బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆదుకొనేంత స్థోమత తనకు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అల్లుఅర్జున్. “అందరికీ హలో! చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను బాగా కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్…
నటుడు సిద్ధార్థ్ ఇటీవల కాలంలో తన ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా “ప్రభుత్వం ప్లాన్ చేసిన వాక్సినేషన్ డ్రైవ్ కన్నా ఇండియన్ ఎయిర్ లైన్స్ పాసెంజర్ సీటింగ్ ఆర్డర్ బెటర్. ఎంత జనాభా ఉందో మీకు తెలుసా ? వ్యాక్సినేషన్ డోసులు ఎన్ని అవసరమో మీకు తెలుసా ? అలాంటప్పుడు 18 ఏళ్ళు నిండిన వారికి అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇస్తామని ఎంయూకు ప్రకటించారు ? దీనికి ఎవరు బాధ్యులు ?” అంటూ ట్వీట్ ద్వారా…
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు.. ఇతర ప్రముఖులు, సాధారణ ప్రజలో ఎంతో మంది కోవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు.. తాజాగా బీహార్ మాజీ ఎంపీ కోవిడ్‌తో కన్నుమూశారు.. ఆర్జేడీ నుంచి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన మొహమ్మద్ షహబుద్దీన్ గత కొన్నిరోజుల క్రింత కోవిడ్ బారినపడ్డారు.. ఆయన వయస్సు 53 ఏళ్లు కాగా.. హత్యానేరం కింద తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులోనే కోవిడ్ సోకింది..…
ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు దేనికీ వెరవని మనిషి. గత యేడాది కరోనా వచ్చి ఇలా తగ్గిందో లేదో తన సినిమా ‘క్రష్’ బాలెన్స్ షూటింగ్ ను మొదలెట్టేశాడు. అయితే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే సుమా! అప్పుడు కూడా కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా షూటింగ్ సంద్భరంగా తెలియచేశాడు రవిబాబు. అలానే కరోనాతో మారిన జనం అలవాట్లనూ ఫన్నీ వీడియోలలో చూపించాడు. తాజాగా ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు వేసుకోమని…
ప్రముఖ నటి సమీరా రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఏప్రిల్ లో సమీరా రెడ్డితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు. తాజాగా సమీరా భర్త అక్షయ్ వర్దే, వారి పిల్లలు నైరా, హన్స్ కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పుడు తన కుటుంబం సురక్షితంగా ఉందని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “కోవిడ్ నెగెటివ్. మా కుటుంబం సురక్షితంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. గత 2 నెలలు మీతో గడిపిన ఫిట్నెస్ ఫ్రైడే…