ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు దేనికీ వెరవని మనిషి. గత యేడాది కరోనా వచ్చి ఇలా తగ్గిందో లేదో తన సినిమా ‘క్రష్’ బాలెన్స్ షూటింగ్ ను మొదలెట్టేశాడు. అయితే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే సుమా! అప్పుడు కూడా కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా షూటింగ్ సంద్భరంగా తెలియచేశాడు రవిబాబు. అలానే కరోనాతో మారిన జనం అలవాట్లనూ ఫన్నీ వీడియోలలో చూపించాడు. తాజాగా ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు వేసుకోమని చెబుతున్నారని, దానిని కూడా పాటించమని మొర పెట్టుకుంటున్నాడు. మనల్ని మనం రక్షించుకోడానికి మాస్క్ పెట్టుకోక తప్పదని హితవు పలుకుతున్నాడు. మరి రవిబాబు మాటలు ఎంతమంది ఆలకిస్తారో చూడాలి.