నటుడు సిద్ధార్థ్ ఇటీవల కాలంలో తన ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా “ప్రభుత్వం ప్లాన్ చేసిన వాక్సినేషన్ డ్రైవ్ కన్నా ఇండియన్ ఎయిర్ లైన్స్ పాసెంజర్ సీటింగ్ ఆర్డర్ బెటర్. ఎంత జనాభా ఉందో మీకు తెలుసా ? వ్యాక్సినేషన్ డోసులు ఎన్ని అవసరమో మీకు తెలుసా ? అలాంటప్పుడు 18 ఏళ్ళు నిండిన వారికి అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇస్తామని ఎంయూకు ప్రకటించారు ? దీనికి ఎవరు బాధ్యులు ?” అంటూ ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు సిద్ధార్థ్. ఇక రీసెంట్ గా దేశంలో జరుగుతున్న హారర్ స్టోరీని సెలబ్రిటీస్ మౌనం చూడటం ఎంత మాత్రం తగదంటూ, కనీసం ప్రజలైనా ప్రశ్నించాలని, ప్రభుత్వాలను నిలదీయాలని కోరుతూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. ఆ తరువాత తన ఫోన్ నంబర్ ను బీజేపీ నేతలు లీక్ చేసి, తనను తిట్టమంటూ కార్యకర్తలను ఉసికొల్పారని, ఇరవై నాలుగు గంటలలో ఐదు వందలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని, తనను చంపుతామని, రేప్ చేస్తామని బెదిరించారని, పోలీసులకు కంప్లైంట్ చేసానని మరో ట్వీట్ చేసి సంచలనానికి తెర తీసాడు సిద్ధార్థ్. ఆ తరువాత ఈ వివాదాన్ని ఇక్కడితోనే వదిలేయాలని అనుకుంటున్నాను అంటూ అక్కడితో ఆపేశారు. మరోవైపు తమిళనాడు బీజేపీ నేతలు కూడా సిద్ధార్థ్ ఆరోపణలను కొట్టిపారేశారు.