కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అటు కోవిడ్ ఆస్పత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా గుజరాత్ లో మరో కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భరూచ్ నగరంలోని వెల్ఫేర్ కోవిడ్ రోగుల ఆస్పత్రిలో ఇవాళ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 14 మంది మృతి చెందారు. వెల్ఫేర్ ఆస్పత్రిలో మంటలు చెలరేగగానే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి 50 మందికి పైగా కరోనా రోగులను కాపాడారు. అగ్నిప్రమాదం వల్ల…
కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ కరోనాకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. 2003 లో భారత సైన్యం నుండి రిటైర్ అయిన తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. పలు సినిమాలు, ఓటిటి, టీవీ షోలలో నటించాడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్. ‘పేజ్ 3’, ‘ఆరాక్షన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పయో’, ‘జబ్…
కరోనా సెకండ్ వేవ్ విలయమే సృష్టిస్తోంది.. ఎంతోమంది సామాన్యులే కాదు.. వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.. ఎవ్వరైతే నాకేంటి అంటూ అందరినీ టచ్ చేస్తోంది వైరస్.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా, అధైర్యపడినా ప్రాణాలు తీస్తోంది.. ఇక, తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఆయన.. పాట్నాలోని ఓ ఆస్పత్రిలో…
కరోనా మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది.. అయితే, అవసరాలను అనుగుణంగా కొన్ని ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలను నడుపుతూ వచ్చినా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది.. ఇక, ప్రస్తుతం సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో.. విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది కేంద్రం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కుంభమేళా కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారిందనే విమర్శలు ఆదినుంచి వినిపిస్తున్నాయి.. దాని తగ్గట్టుగానే క్రమంగా పీఠాధిపతులు కన్నుమూయడం కలకలం రేపుతోంది.. తాజాగా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ మహంత్ లఖన్ గిరి కన్నుమూశారు.. అనారోగ్యంబారినపడి మూడు వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనకు .. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. మహంత్ లఖన్ గిరిని…
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది ప్రభుత్వం.. ఇక, మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమలుచేయనున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మే 2న కౌంటింగ్ ప్రక్రియతో పాటు…
కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మన ఫిల్మ్ సెలబ్రిటీస్ కొత్త పంథాను ఎంపిక చేసుకున్నారు. చాలామందికి తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, ఎలాంటి సహాయం పొందాలనేది తెలియకుండా ఉంది. అలా ఇబ్బంది పడేవారికి, వారికి సాయం చేయాలనుకునే వారికి మన సెలబ్రిటీస్ వారధిగా నిలుస్తున్నారు. తాజాగా ఈ విషయంలో రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ బృందం సైతం తన ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి…
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన కూల్ లుక్ తో వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాస్ న్యూ లుక్ లో కూల్ క్యాజువల్స్ లో.దర్శనమిచ్చారు. వైట్ ఓవర్ సైజ్డ్ టీ, కామో ప్యాంటు, బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా స్టార్ నటన, డౌన్ టు ఎర్త్…
కరోనాను ఎదుర్కొవడంలో కేవలం వైద్య సిబ్బందే కాదు… ఇతరులూ తమ వంతు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ మొదలు కొని ఎంతో మంది సెలబ్రిటీస్ తమ పరిథిలో ఆపన్న హస్తం అందించే పనిలో ఉన్నారు. సురేశ్ ప్రొడక్షన్ వంటి నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు కరోనా బాధితుల అవసరాలు తెలుసుకుని, సోషల్ మీడియా ద్వారా వారికి సహాయం చేసే వారికి ఆ విషయాన్ని చేరవేసే పని చేస్తున్నాయి. ఇదే సమయంలో నటుడు రానా మరో అడుగు ముందుకేసి కరోనా…
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కరోనా వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. చాలామంది సెలెబ్రిటీలు ఇప్పటికే మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోగా… కొంతమంది సెకండ్ డోస్ కూడా తీసుకుంటున్నారు. ఇటీవలే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తాజాగా సీనియర్…