సామాజికాంశాల విషయమై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం మొదటి నుండి హీరో సిద్ధార్థ్ కు అలవాటు. దాంతో కొన్నిసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. అయినా ఆ అలవాటు మార్చుకునే ప్రయత్నం సిద్ధార్థ్ ఎప్పడూ చేయలేదు. తాజాగా సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం అట్టుడిపోతుంటే ప్రభుత్వాలు పెద్దంతగా పట్టించుకోవడం లేదని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. ఇదే సమయంలో ఈ విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన సెలబ్రిటీస్ సైతం మౌనంగా ఉండటం…
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ నెల 13న వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు అనిల్ హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా కు తగిన చికిత్సను తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని, ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా రిపోర్ట్ నెగెటివ్ వచ్చిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం విషయమై ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ అనిల్ రావిపూడి కృతజ్ఞతలు…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకం మెరిసింది. ఇండియాలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాలపై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాతో వెలిగిపోయాయి. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇండియా ఇన్ యూఏఈ’…
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించడగా.. ఇప్పుడు అమెజాన్ ఇండియా కూడా ముందుకు వచ్చింది. ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్ పుణె ప్లాట్‌ఫామ్ ఫర్ కోవిడ్-19 రెస్పాన్స్‌లతో చేతులు కలిపి ఆ సంస్థ.. అత్యవసరంగా సింగపూర్ నుంచి 8 వేల ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్‌లను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది… మరో 500 బై-లెవెల్ పాజిటివ్…
కరోనాతో నటుడు, దర్శకుడు, నిర్మాత లలిత్ బెహల్ మృతి కోవిడ్ -19 సంబంధిత అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్ళు. గతవారం ఈ సీనియర్ నటుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. లలిత్ బెహల్ కుమారుడు, దర్శకుడు కను బెహల్ మాట్లాడుతూ ‘శుక్రవారం మధ్యాహ్నం ఆయన చనిపోయారు. గతంలో నుంచి గుండెకు సంబంధించిన అనారోగ్యం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో…
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రదీప్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడట. అయితే ప్రదీప్ ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. ఇటీవలే ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్’ ముగిసింది. ఆ తరువాత ప్రదీప్ ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’కు వ్యాఖ్యాతగా చేశాడు. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’…
సోనూ సూద్ అభిమానులందరికీ ఓ శుభవార్త. తాజాగా జరిపిన కోవిడ్ 19 పరీక్షలలో తనకు నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని సోనూ సూద్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. నిజానికి కొద్ది రోజుల ముందు సోనూసూద్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అనే రిపోర్ట్ రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న సోనూ అభిమానులు కోట్లాది మంది ఆవేదన చెందారు. కొందరైతే ‘దేవుడికి కూడా కరోనా వస్తుందా?’ అంటూ ఆందోళన వ్యక్తం…
కొవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి ఊపిరితిత్తులు దాదాపు 85-90 శాతం దెబ్బతిన్నాయి. సోనూసూద్ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రి డాక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ఇ.సి.ఎం.ఓ. శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు వారు సోనూసూద్ కు తెలిపారు.…
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు మరో హీరో కరోనా బారిన పడ్డాడు. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అతికొద్ది లక్షణాలు కనిపించడంతో కళ్యాణ్ బుధవారం రోజున కరోనా టెస్ట్ చేయించుకున్నారట. అందులో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను అని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని,…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ –…