కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ కూడా ప్రకటించారు. అయినా కొంత మంది ఊసుపోక వీధుల్లో తిరుగుతున్నారు. ఇక ఎంతో మంది జనాలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ… ‘ఈ వైరస్ నుండి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతోంది. అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినుంచి బయటకు రాకండి. తప్పని సరిగా మాస్క్ ధరించండి. వీలైతే…
ప్రముఖ స్క్రీన్ రైటర్, నటుడు మాడంపు కుంజుకుట్టన్ మే 11న మంగళవారం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. స్క్రీన్ రైటర్, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ అకాల మరణం నుండి మలయాళ చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేనే లేదు. మే 10న దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ మరణించారు. అంతలోనే జాతీయ అవార్డు గెలుచుకున్న స్క్రీన్ రైటర్ మాడంపు కుంజుకుట్టన్ ను కరోనా బలి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. మాడంపుకు తీవ్రమైన జ్వరం…
స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందన క్యాన్సర్ పోరులో ఓడిపోయారు! ఈరోజు కన్నుమూశారు! స్వాతి పబ్లిషర్ , ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తె ఈమె! స్వాతి నిర్వహణ లో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిచందన భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్ గా పని చేస్తున్నారు. మణిచందన వయసు 46. ఇద్దరు పిల్లలు. గత ఏడాదిగా ఆమె కాన్సర్ తో పోరాడుతున్నారు. వారం రోజుల క్రితం కరోనా బారిన…
కోవిడ్ -19 సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ;లాక్ డౌన్ విధించగా… మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇంట్లో ఉండడం ఇప్పుడు అభిరుచిగా మారిందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఇంట్లో ఉండడమే తన కొత్త హాబీనట. టీకాలు వేసి కోవిడ్‌ను తరిమికొట్టాలని ఆమె…
దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరోనా వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందుగానే జాగ్రత్త వహించడం మంచిది. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇదే చెప్పారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. “కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. లక్షలాది మంది…
కోవిడ్-19 సెకండ్ వేవ్ తో దేశంలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎంతోమంది కరోనాతో కన్నుమూస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్‌మెన్, స్పాట్‌బాయ్‌లు తదితరులు… ఇలా 25,000ల మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,500ల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్…
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి కరోనా సోకగా.. ఈరోజు ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు. రెండు వారాల క్రితమే వేద తల్లి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వేద కృష్ణమూర్తి భారత…
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంతకుముందు కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఎక్కడ కష్టం అనే మాట వినిపించిన అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలోనూ సోనూసూద్ వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనూసూద్ చేస్తున్న సాయం ఆయనను పేదల పాలిట దేవుడిని చేస్తోంది.…
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు సినిమా ఇండస్ట్రీపై కూడా బాగా పడుతోంది. కరోనా వల్ల స్టార్స్ అంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు ఆలస్యం కాబోతున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్ ప్రణాళికలకు కరోనా బ్రేక్ వేసేసింది. కరోనా కారణంగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి…
బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్స్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. “మీ ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. చివరకు నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. మీ విషెస్ మరియు హీలింగ్ ఎనర్జీ అంతా ఇంద్రజాలం చేసినట్లు అనిపించింది. సురక్షితంగా ఉండండి” అంటూ నవ్వుతూ ఉన్న సెల్ఫీని పోస్ట్ చేసింది పూజా. ఏప్రిల్ 26న కరోనా సోకినట్లు ప్రకటించింది…