రెండు దశాబ్దాలకు పైగా జగపతి బాబు అభిమానిగా ఉన్న శ్రీను ఈ రోజు ఉదయం కరోనాతో గుంటూరులో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జగపతిబాబు తన సంతాపాన్ని తెలియచేశారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గానూ ఉన్న శ్రీను మరణం జీర్ణించుకోలేనిదని అన్నారు. విశేషం ఏమంటే… జగపతిబాబును ఎంతగానో అభిమానించే శ్రీను తన కుమారుడొకరికి జగపతి పేరునే పెట్టారు. శ్రీను కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపిన జగపతిబాబు, కరోనా కారణంగా కళ్ళ ముందు ఎంతో మంది కన్నుమూస్తున్నారని, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దయచేసి అందరూ మాస్క్ లు ధరించాలని, శానిటైజర్ వాడాలని ఆయన హితవు పలికారు.