కరోనా మూడో వేవ్ సీరియస్ గా ఉండకపోవచ్చు అని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ఆగస్టు చివర్లో మూడో వేవ్ వస్తుందో, రాదో తెలిసిపోతుందన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం అసలైన సవాళ్లు అని పేర్కొన్నాడు. ప్రస్తుత జాగ్రత్తల…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
ప్రముఖ నటుడు సోనూసూద్ కోవిడ్ -19 సంక్షోభ సమయంలో తాను చేసిన సేవతో రియల్ హీరోగా ఎదిగారు. భారతదేశం అంతటా ప్రజలకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ నటుడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన క్రేజ్ ఇప్పుడు అమాంతంగా ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకుంది. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఆఫర్లు భారీగా వస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా సోనూసూద్ ను హీరోగా పెట్టి సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్ల రీ ఓపెనింగ్ విషయమై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్స్ ను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. దానికి కారణం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతినివ్వడం, ఆంధ్రప్రదేశ్ కేవలం మూడు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి విషయాలు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం అన్ని ప్రదర్శనలను అనుమతించినప్పటికి రాత్రి 10 నుండి నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక ఇటీవల…
కరోనా మహమ్మరి సినీ నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలకి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తోంది! రెండేళ్లుగా అమాంతం విజృంభించి లాక్ డౌన్ లు నెత్తిన పడేస్తోంది. థియేటర్స్ లేక దేశంలోని అన్ని సినిమా రంగాలు అల్లాడిపోతున్నాయి. ఇక బాలీవుడ్ సంగతి సరే సరి. హిందీ సినిమాకు గుండెకాయ లాంటి ముంబై అత్యధిక కరోనా కేసులతో వణికిపోయింది. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా సద్దుమణిగింది. కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయినా బీ-టౌన్ బిగ్ మూవీస్ రిలీజ్ కు…
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి. అయితే జూలై 9 నుండి సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు తిరిగి తెరవబడతాయని యూపీ సినిమా ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ ఇంతకుముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకున్నారు. Read Also : పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ…
టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు. టోక్యోలోని హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా టీం ఆటగాళ్లకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా సోకింది. ఈ బృందం నాంటో నగరంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందాల్సి ఉండగా, పాజిటివ్‌గా తేలిన అథ్లెట్‌ను ఐసోలేషన్‌కు పంపారు. మిగతా వారిని ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించారు. గత నెలలో జపాన్ చేరుకున్న ఉగాండా జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు కూడా కరోనా…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. read also : తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్ అయితే..…
కరోనా కట్టడి చర్యల కోసం కేంద్రం… 6 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లాయి. కరోనా కట్టడిని తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ముఖ్యంగా నిఘా, కరోనా నిరోధక చర్యలు, పరీక్షలు, కోవిడ్ నిబంధనావళి అమలు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ వంటి సౌకర్యాలను సమీక్షిస్తారని నీతి…
కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. దీంతో.. ప్రభుత్వం వేగంగా వ్యాక్సిన్ పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతోంది.. ఇప్పటికీ కొన్ని అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. అందులో గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్‌పై రకరకాల ప్రచారలు జరిగాయి.. అన్నింటికీ చెక్ పెడుతూ… గర్భిణీ స్త్రీలు కూడా టీకాకు అర్హులేనని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. రోగనిరోధకతపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టిఐజి) సిఫారసులను అంగీకరించిన ఆరోగ్య మంత్రిత్వ…