కరోనా కారణంగా థియేటర్లను క్లోజ్ చేయడాన్ని కొందరు ఎగ్జిబిటర్స్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. అందులో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కూడా ఒకటి. గతంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటుగా ఉండేది. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేదీ ఇదే. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు.…
ఆస్ట్రేలియాలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా సిడ్నీలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ రెండో దశ లాక్‌డౌన్ విధించింది. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సిడ్నీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. లాక్‌డౌన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఫ్రీడం, అన్‌మాస్క్ ది ట్రూత్ నినాదంతో ఆస్ట్రేలియాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సిడ్నీ సహా అనేక నగరాల్లో ప్రజలు…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… ప్రభుత్వ ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుండగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం డబ్బులు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.. ఈ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించారు.. ఉచిత టీకా డ్రైవ్‌ను విస్తరించేందుకు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద నిధులకు సహాయం చేయమని కార్పొరేట్‌లను…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో కల్లోలమే సృష్టించింది.. కొత్త రికార్డుల సృష్టించాయి పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య… క్రమంగా కేసులు తగ్గినట్టే తగ్గినా.. పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. కానీ, మరోమారు విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలే ఇందుకు సూచికలుగా నిలుస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెండింతలయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదు కాగా.. అంతకుమందు వారంలో ఇది…
కరోనా డెల్టా వేరియంట్ మరింత డేంజర్‌గా మారుతోంది. డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లినా సరే.. ఇన్ఫెక్షన్ సోకుతుందని తేల్చారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఈ వేరియంట్ సోకుంది. కరోనా వ్యాప్తి ప్రారంభంలో వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పటినుంచి ఇన్ఫెక్షన్ బారిన పడటానికి మధ్య సరాసరి ఆరు రోజుల వ్యవధి ఉండేది. కానీ డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. టీకాలు తీసుకున్న వారికి సైతం డెల్టా వేరియంట్…
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ప్రదర్శనదారులతో కలసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కె.టి.రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఛీప్ సెక్రటరీ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ కు ఓ లేఖ రాస్తూ తమ అభ్యర్ధన మేరకు సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే సౌలభ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. పలు సమస్యల వల్ల థియేటర్లు మూతవేసుకునే పరిస్థితి వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ముందుకు…
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది.. ఇక, విద్యారంగానికి సవాల్ విసిరింది.. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి.. దీంతో.. చాలా మంది విద్యార్థుల చదవులు అటకెక్కాయి.. కొంతమంది విద్యార్థులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.. ఆన్‌లైన్ విద్య పేరుకు మాత్రమే అన్నట్టుగా తయారైంది.. కరోనా విలయం, లాక్‌డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. అయితే, స్కూళ్ల పునర్ ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు…
వర్సిటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’, ‘మారా’ చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సినవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం, ఒకవేళ తెరిచినా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపారు. అలా ఓటీటీ లోనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే…. మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ…
టోక్యో ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కలకలం రేపింది. నేడు నిర్వహించిన కరోనా పరీక్షలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఒలంపిక్స్ విలేజ్ లో నిన్న తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఈరోజు అక్కడ అందరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇద్దరికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇక ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రతిరోజు క్రీడాకారులకు…