కరోనా మహమ్మారి మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటోంది. తగ్గింది అనుకునేలోపే ఉగ్రరూపం చూపిస్తోంది ప్రతి ఏడాది. ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టుంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సమంత సైతం కడప ట్రిప్ అనంతరం జలుబు రావడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంది. ఆమె అభిమానుల ఆందోళన ఇంకా తగ్గక ముందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా కోవిడ్ 19 నిర్ధారణ అయినట్లు సమాచారం.
Read Also : వెంకీ మామ షాకింగ్ లుక్… ఓల్డ్ మ్యాన్ పిక్ వైరల్
వారిద్దరూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక పార్టీలకు హాజరయ్యారని, ఇద్దరు నటీమణులను ఇటీవల కాలంలో కలిసిన వ్యక్తులు RT-PCR పరీక్ష చేయించుకోవాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. సామాన్య ప్రజల సంగతి అటుంచితే… సెలెబ్రిటీలే ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అభిమానులకు స్ఫూర్తిని ఇచ్చేలా ఉండాల్సిన ఇలాంటి కొందరు సెలెబ్రిటీలు వాళ్ళతోనే చెప్పించుకునే పరిస్థితి వస్తోంది. ఇలాగైతే అతి తక్కువ సమయంలో కరోనా మహమ్మారి మరోమారు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.