సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ మొదలైంది.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్ బెటరా..? కోవిషీల్డ్ వేసుకుంటేనే మంచిదా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే, ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కాబట్టి టీకాల పనితీరుపై సందేహాలు పక్కనపెట్టి, వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాలు ఒమిక్రాన్‌పై కనీసం 50 శాతం మేర సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
Read Also: ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..!
వ్యాక్సినేషన్‌తో జబ్బు తీవ్రరూపం దాల్చకుండా ఉంటుందని.. ఇప్పటికే రెండు డోసులూ పూర్తయిన వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు వైద్య నిపుణులు.. కోవిడ్ సోకినవారిలోగాని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోగాని 6 నెలల తరువాత పరీక్షలు జరిపితే.. యాంటీబాడీస్ గణనీయంగా తగ్గిపోతున్నాయని.. యాంటీబాడీస్ తగ్గిపోతే మళ్లీ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని… ఈ సమస్యను అధిగమించాలంటే రెండు డోసులు పూర్తయిన ఆరు నెలల తరువాత, బూస్టర్ డోసు తీసుకోవాలంటున్నారు… అయితే, బూస్టర్ డోస్‌లో క్రాస్ వ్యాక్సిన్ మంచిదని సూచిస్తున్నారు.. అంటే మొదటి రెండు డోసులు ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకున్నవారు, బూస్టర్ డోస్‌కు వచ్చేసరికి మరో రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి.. దీంతో శరీరంలో రెండు వేరువేరు యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయని చెబుతున్నారు.. ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకుంటే 900 యాంటీబాడీస్ వస్తాయని.. అదే క్రాస్ వ్యాక్సిన్ అయితే 1800 యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నమాట.. కాగా, భారత ప్రభుత్వం ఇప్పటి వరకు బూస్టర్ డోస్‌పై ఎలాంటి నిర్ణయానికి రాలేదు.. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న వేళ.. ఆ వైపు అడుగులు వేస్తుందా..? లేదా? అనేది వేచిచూడాల్సిన విషయమే.