దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పొల్చితే ఇవాళ నమోదు అయిన కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10,112 నమోదు కాగా, సోమవారం (ఏప్రిల్ 24) భారతదేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 7,178 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,683కి తగ్గింది. శనివారం రికార్డు స్థాయిలో 12,193కి పెరిగిన కోవిడ్ కేసులు.. వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి.
Also Read:Eligibility for Marriage Scheme: మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం
మహారాష్ట్రలో 545 తాజా కరోనావైరస్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 948 కేసులు వెలుగు చూశాయి. ఇద్దరు మృతిచెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 25.69 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రతో సహా ఎనిమిది రాష్ట్రాలను కఠినంగా పర్యవేక్షించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో కేసులు తక్కువగా నమోదు కావడం గమనార్హం.
కోవిడ్ ఇంకా ముగియలేదని నొక్కి చెబుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీకి రాసిన లేఖలో ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.