శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు విధించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అప్రమత్తం అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.
Read: ఈ నౌకకు ఇంధనం అవసరం లేదు… ఎంత దూరమైనా…
ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే హోంక్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చేరాలి. ప్రయాణికుల పరీక్షల కోసం ఎయిర్‌పోర్టులో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.