దక్షిణాఫ్రికాలో ఇటీవలే కొత్త వేరియంట్ బయటపడింది. బి.1.1.529 వేరియంట్ వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. విదేశీయులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది బ్రిటన్ ప్రభుత్వం. అంతేకాదు, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. ఇక జింబాబ్వే, నమీబియా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఆంక్షలు విధించాయి.
Read: ‘లక్ష్య’ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
అమెరికాలోనూ రేపటి నుంచి విధించిన ఆంక్షలు అమలులోకి రాబోతున్నాయి. ఇక దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలను 14 రోజులపాటు సస్పెండ్ చేసింది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీకి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరికి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ సోకింది. దీంతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, ఇజ్రాయిల్ ప్రభుత్వం దేశ సరిహద్దులను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.