ప్రపంచానికి మళ్లీ కరోనా భయం పట్టుకుంది. మొన్నటి వరకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్ రాకతో భయందోళనలు నెలకొన్నాయి. 32 మ్యూటేషన్లతో భయపెడుతున్న మహమ్మారి బి.1.1.529 కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. కరోనా 19, దాని నుంచి ఏర్పడిన వేరియంట్లకు గ్రీక్ అక్షరమాల నుంచి పేర్లు పెట్టాలి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా అన్నిటికీ గ్రీక్ అక్షరమాల నుంచి తీసుకొని పేర్లు పెట్టారు.
Read: నేపాలీ బాలికను దత్తత తీసుకున్న నిర్మాత బండ్ల గణేష్.. నెటిజన్‌ల ప్రశంసలు
ఈ క్రమంలో చూసుకుంటే కొత్త వేరియంట్‌కు ను అనే పేరు పెట్టాలని. ను వేరియంట్ తరువాత మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే దానికి జి (xi) తో పేరు పెట్టాల్సి వస్తుంది. గ్రీక్‌పదం జీ… చైనా అధ్యక్షుడి పేరు జీ జిన్‌పింగ్ మొదటి అక్షరంతో కలుస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ జీ పదంలో పేరు పెడితే జరిగే పరిణామాలను ముందుగానే గమనించి ను, జీ అక్షరాలను వదిలేసి తరువాత వచ్చే అక్షరంతో ఒమిక్రాన్ అనే పేరును పెట్టింది. ఈ ఒమిక్రాన్ లో 32 మ్యూటేషన్లు ఉండటం అందర్ని భయాందోళనలకు గురిచేస్తోంది.