Influenza: భారతదేశ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి దీర్ఘకాలిక దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. రెండు ఏళ్లుగా కోవిడ్ తో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతన్న ఫ్లూతో భయపడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా-ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
Hong Kong: కరోనా మహమ్మారి వచ్చి మూడేళ్లయింది. ప్రజల జీవితాలతో వైరస్ చెలగాటమాడింది. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ఈ మూడేళ్లలో ప్రజల జీవన స్థితిగతుల్లో పెను మార్పులు వచ్చాయి.
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు.
Covid 19 situation in China: చైనాలో కోవిడ్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు చైనా ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చైనీస్ న్యూ ఇయర్ కోసం దేశవ్యాప్తంగా కోట్లలో ప్రజలు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చైనీస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. జనవరి 13…
Covid Nasal Vaccine: కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ని భారతదేశంలో తొలిసారిగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు.
Covid Situation in China: కరోనా మహమ్మారి పుట్టిన చైనా ఇప్పుడు ఆ వైరస్ తోనే అల్లాడుతోంది. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా చైనాలో కోవిడ్ 19 కేసులు నమోదు అవుతున్నాయి. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ధాటికి చైనా ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చైనాలో 80 శాతం మంది ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు అక్కడి ప్రభుత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రెండు మూడు నెలల్లో అతిపెద్ద కోవిడ్ 19 వేవ్…
Declining population in China: చైనాలో 2022లో తక్కువ జనాభాను నమోదు చేస్తుందని జనాభా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1961లో మహా కరువు తర్వాత 2022లో తొలిసారిగా చైనాలో జనాభా తగ్గదల కనిపించింది. 2022లో చైనాలో కొత్త జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 2022లో శిశువుల జననాలు 10 మిలియన్ల కన్నా తక్కువగా నమోదు అయ్యాయి. అంతకుముందు ఏడాది 10.6 మిలియన్ల శిశువులు జన్మించారు. 2020తో పోలిస్తే 11.5 శాతం తక్కువగా జననాలు…
Centre's Panel Recommends Market Clearance To Covovax As Covid Booster: కరోనా మహమ్మారిపై పోరులో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య దాదాపుగా తగ్గింది. ఇదిలా ఉంటే ప్రస్తుత చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం కోరుతోంది.
Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయాయి.
Corona : కరోనా మహమ్మారి మరో మారు ప్రపంచాన్ని హడలెత్తించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి.