భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్ కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 8,31,300కు పెరిగింది.
Covid-19: భారతదేశంలో ప్రతీరోజూ 10 వేలకు అటూఇటూగా కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 19 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 9 మంది ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. అయితే నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు గణనీయంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే…
Diabetes: కోవిడ్ ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నాయి. అయినా కూడా ప్రపంచంలో ఇంకా దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడో చోట కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. శ్వాససంబంధ ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉన్నారు. తాజాగా ఓ అధ్యయనం డయాబెటిస్ వ్యాధి కోవిడ్ తో ముడిపడి ఉన్నట్లు కనుగొంది.
Covid 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,111 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
Covid-19: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న 10,000లను దాటిని కేసుల సంఖ్య, ఈ రోజు 11,000లను దాటింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 9 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం 49,622కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిన డేటా ప్రకారం..
Covid-Like Pandemic: 2019లో చైనా వూహాన్ నగరంలో నెమ్మదిగా మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను పట్టిపీడిస్తోంది. కోవిడ్ వ్యాధి ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా ఇప్పటికే ఈ మహమ్మారి తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో లక్షల సంఖ్యలో మరణాలకు కారణం అయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. మహమ్మారి దెబ్బతో ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేకపోతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ…
Covid 19: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. గత ఐదారు నెలలుగా స్తబ్ధుగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం మళ్లీ పెరుగుతన్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం కేసులు 1000 లోపే పరిమితం అయ్యేవి, కానీ కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ.. 5000 మించి నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో ఉందని, మరో 10-12 రోజుల వరకు కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు…
Covid Mock Drill: ఇక, కరోనా మాయం అయ్యింది.. సాధారణ పరిస్థితులు వచ్చాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి కేసులు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.. దేశవ్యాప్తంగా కోవిడ్.. మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల్లోనే 5వేల 880 పాజిటివ్‌లు నిర్దారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు దాదాపు 7శాతానికి చేరుకుంది. వారం రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమలు చేస్తున్నాయ్.…
COVID 19 : మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కేంద్రం సూచనలతో ఆయా రాష్ట్రాలకు కూడా ఎలాంటి పరిస్థితి విచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా ఇవాళ సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ఆయన.. కోవిడ్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా వ్యాపిస్తుందన్న…
Covid-19: దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రోజూవారీ కేసుల సంఖ్య వేలల్లో నమోదు అవుతున్నాయి. వరసగా కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు 5 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,357 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత రెండు రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 32,814 కి చేరుకుంది.