ఒమిక్రాన్ అలర్ట్: అర్థరాత్రి నుంచి కొత్తరూల్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది. జపాన్‌లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలి. నెగిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.
Read: టెస్లాకు ధీటుగా మరో కొత్తకారు… ఛార్జింగ్ లేకున్నా…
Also Read
ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ తరువాత 8వ రోజు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే బయటకు ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే వారిని సపరేట్‌గా క్వారంటైన్‌కు తరలిస్తారు. వారి శాంపిల్స్‌ను INSACOG ల్యాబ్ కు పంపి జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేయిస్తారు. ఒకవేళ అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలితే వారిని సాధారణ కరోనా చికిత్సను అందిస్తారు. అదే ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేకమైన చికిత్సను అందిస్తారు. యూకేతో పాటు అధిక రిస్క్ ఉన్న 44 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు దృష్టి సారించారు. కేంద్రం విడుదల చేసిన కొత్త రూల్స్ ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రాబోతున్నాయి.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!