ఒమిక్రాన్ పేరు వింటే ప్రపంచం గజగజవణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఆ తరువాత ప్రపంచాన్ని ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేయడంతో ఆన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. నిన్నటి రోజున జపాన్ వీదేశీయులపై నిషేదం విధించింది. ఇలా నిషేదం విధించిన మరుసటిరోజే జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం… అప్రమత్తమైన యంత్రాంగం…
నమీబియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆ వ్యక్తిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజీసెస్ లో ఉంచి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ కావడంతో జపాన్ అలర్ట్ అయింది. తొలికేసు నమోదు కావడంతో ఆంక్షలను మరింత కఠినం చేసేందుకు సిద్ధమవుతున్నది ప్రభుత్వం. జపాన్‌లో తొలికేసు నమోదు కావడంతో చుట్టుపక్కల ఉన్న దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.