ఒమిక్రాన్ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.. ఊహించని విధంగా స్పీడ్‌గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఇప్పటికే ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో చాలా మంది ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపడంతో.. విమాన ఛార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని.. దీనికి పండుగల సీజన్ కూడా తోడు కావడం కూడా విమాన ఛార్జీల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు..
Read Also: ఒమిక్రాన్ విజృంభణ.. 38 దేశాలకు పాకింది..
Also Read
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో భారత్ నుంచి అధిక రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలకు విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయినట్టు చెబుతున్నారు.. తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి కెనడాలోని టోరంటోకి గతంలో కనీస ఛార్జీ రూ.80వేలుగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా అది రూ. 2.37 లక్షలకు చేరిపోయింది.. ఇక, ఢిల్లీ నుంచి లండన్‌కు గతంలో రూ. 60గా ఉంటే.. ఇప్పుడు రూ. 1.20 లక్షలు దాటేసింది.. ఢిల్లీ నుంచి దుబాయ్‌కి రూ. 20 వేలుగా ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ. 33 వేల వరకు పెరిగింది.. ఇతర దేశాలకు కూడా ఇదే పరిస్థితి ఉందని సమాచారం.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే రెట్టింపు డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే.. కరోనా మరింత విస్తరించకముందే గమ్యానికి చేరుకోవాలని ప్రయాణికులు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడంలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..