సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జట్ స్పీడ్‌తో ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. అయితే, ఒమిక్రాన్ వేగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది… మరింత అప్రమత్తత అవసరమని వార్నింగ్ ఇస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే 77 దేశాల్లో నమోదు అయినట్టు తెలిపారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్.. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో పడిపోయారని వెల్లడించారు.. ఇదే సమయంలో.. ఒమిక్రాన్ నివారణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసిని ఆయన.. వైరస్ తీవ్రతను అంచనా వేయడంలో విఫలం అయ్యారన్నారు.
Read Also: హోటల్‌లో టిప్పు విషయంలో గొడవ.. యువకులపై దాడి..
ఇక, ఒమిక్రాన్ వేరియంట్‌లో స్వల్ప తీవ్రత ఉన్నప్పటికీ దాంతో ఆరోగ్య వ్యవస్థపై మళ్లీ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూహెచ్‌వో.. ఈ కొత్త వేరియంట్ తొలిసారి నవంబర్ నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించారని.. ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా కోవిడ్ బారినపడ్డారని.. స్వల్ప లక్షణాలే ఉన్నా.. ఇంకా ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారని గుర్తుచేవారు టెడ్రోస్.. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసమానతలు ఉన్నాయని.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని దేశాలు బూస్టర్ డోసులు ఇస్తుంటే.. ఇంకా కొన్ని దేశాలకు అసలు వ్యాక్సిన్లు అందలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.