కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ థర్డ్ వేవ్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ సమయంలోనూ చిన్నారులు కరోనా బారినపడ్డా.. ఇప్పుడు ఒమిక్రాన్ చిన్నారులపై పడగ విప్పుతుందా? అనే టెన్షన్ మొదలైంది.. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే.. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్ 10న హైదరాబాద్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అబుదాబి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ఆర్టీ- పీసీఆర్ టెస్ట్ కోసం నమూనాలు సేకరించారు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలింది.. కానీ, బాలుడి తల్లిదండ్రులకు ఒమిక్రాన్ నెగిటివ్‌గా వచ్చింది… దీంతో.. ముర్షిదాబాద్ జిల్లాలో స్థానిక ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు.. భారత్‌లో ఇప్పటి వరకు 40కి పైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. అందులో ఓ చిన్నారి కూడా ఉండడం ఇప్పుడు కలవరానికి గురిచేస్తోంది.. ఒమిక్రాన్ నుంచి ప్రాణాపాయం పెద్దగా లేదని చెబుతున్నా.. జెట్ స్పీడ్‌తో వ్యాపిస్తోంది.. మరి.. చిన్నారులపై దీని ప్రభావం ఏస్థాయిలో ఉంటుంది అనేది మాత్రం తేలాల్సిఉంది.