సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్.. యూఎస్‌లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరోవైపు.. కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటింది… ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది.. తాజాగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ తొలి మరణం కూడా నమోదు అయ్యింది. జెట్ స్పీడ్‌తో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో.. అప్రమత్తమైన దేశాలు.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.. ఇక, మరికొన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి… ఓవైపు వ్యాక్సిన్ వేసుకోనివారికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ కొనసాగిస్తూనే. మరోవైపు బూస్టర్ డోసుకు శ్రీకారం చుడుతున్నాయి.
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్