మహారాష్ర్టలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే అప్రకటిత లాక్‌డౌన్‌తో ఉన్న ముంబైసహా ఇతర నగరాల్లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఓవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్‌తో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా, ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. తాజాగా మహారాష్ట్రలో 18,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో 20 మంది మృతి చెందారు. Read Also:శార్దుల్ మ్యాజిక్‌తో 226 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ రాష్ర్టంలో ఇంకా 66,308…
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓమిక్రాన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గతంలో 10వేల కన్నా దిగువగా ఉండే కేసులు ప్రస్తుతం 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. జనాలు కరోనా నిబంధనలు పాటించేలా హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా కరోనా ప్రభావం న్యాయ వ్యవస్థపై కూడా పడుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం…
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆంక్షలను కఠినంగా అమలుచేస్తున్నారు. రోజువారీ కేసులు మహారాష్ట్రలో 11 వేలు దాటిపోయాయి. ముంబై నగరంలో 8 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ శాతం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ముంబై నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ముంబై నగర మేయర్ కిషోరీ పడ్నేకర్ స్పందించారు. ముంబైలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని, ముంబైలో…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారు వీరు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ రోజు పంజాబ్ పటియాల మెడికల్ కాలేజీలో 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయ్యి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కరోనా కేసులు, కొత్త వేరియంట్ కేసులు ఎన్ని ఉన్నాయో ఆ దేశం స్పష్టంగా బయటపెట్టడం లేదు. రెండు మూడు కేసులు బయటపడినా నగరాలను లాక్ డౌన్ చేస్తున్నది. తాజాగా యుజ్హౌ నగరంలో లాక్ డౌన్‌ను విధించారు. 1.2 మిలియన్ జనాభా కలిగిన యుజ్హౌ నగరంలో బయటపడింది కేవలం 3 కరోనా…
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో…
దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు గోవా వెళ్లారు. నూతన సంవత్సర వేడుకల తరువాత ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముంబై పోర్ట్ నుంచి గోవాకు కార్డెలియా క్రూజ్ షిప్ వెళ్లింది. అయితే, 2000 మంది టూరిస్టులతో బయలుదేరిన…
దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లలకు ఆన్‌లైన్ విద్య కొనసాగుతుందన్నారు. Read Also:రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా…
చిత్ర పరిశ్రమను కరోనా వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు పెరిగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు మరో ముగ్గురు స్టార్లు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేత ఏక్తా కపూర్ కారోబా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసున్నప్పటికీనేను…
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒమిక్రాన్ రాకతో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది యూఎస్‌లో అత్యధిక సంఖ్యలో రెండు లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది, ఆ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఒక్కరోజులో 4 నుంచి 5 లక్షల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 30 నుంచి 40 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల పెరుగుదల కారణంగా ఆసుపత్రులపై…