దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లలకు ఆన్‌లైన్ విద్య కొనసాగుతుందన్నారు.
Read Also:రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ముంబైలో కూడా 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ సమయంలో 10వ తరగతి, 12వ తరగతులకు మాత్రమే క్లాసులు జరగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. 11వ తరగతి క్లాసులు ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం.అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ కరోనా ప్రభావంతో గతేడాది కాలంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.