మహారాష్ర్టలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే అప్రకటిత లాక్‌డౌన్‌తో ఉన్న ముంబైసహా ఇతర నగరాల్లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఓవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్‌తో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా, ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. తాజాగా మహారాష్ట్రలో 18,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో 20 మంది మృతి చెందారు.
Read Also:శార్దుల్ మ్యాజిక్‌తో 226 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
రాష్ర్టంలో ఇంకా 66,308 యాక్టివ్ కేసులున్నాయి ఒక్క ముంబాయిలోనే 10,860 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఒమిక్రాన్ విజృంభణ కూడా కొనసాగుతోంది. మహారాష్ర్టలో కొత్తగా 75 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరింది. మంగళవారం ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ మాట్లాడుతూ.. రోజువారీ కోవిడ్ -19 కేసులు 20,000 మార్కును దాటితే, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగరంలో లాక్‌డౌన్ విధించాల్సి ఉంటుందని తెలిపారు.