కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం లేకుండా.. ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఢిల్లీ సర్కార్.. కోవిడ్‌పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతోన్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. మరోవైపు, జమ్ములోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది.. అక్కడ వైద్య…
రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కాకుండా ఆమె ఫ్యామిలీ అంతా కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా…
కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదైతే, బుధవారం రోజున 58 వేలకు పైగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఒక్కరోజులో దాదాపు 20 వేలకు పైగా కేసులు పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు వంటి వాటిని మూసివేశారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.…
ఏపీలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో బుధవారం మధ్యాహ్నం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరితో పాటు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. Read Also: పావురం కాలికి చైనా ట్యాగ్……
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాజిటివిటి రేటు మంగళవారం రోజున 8.3గా నమోదైన సంగతి తెలిసిందే. సోమవారం రోజున పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉన్నది. దీనిని బేస్ చేసుకొని ఈరోజు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 10 శాతం నమోదయ్యే అవకాశం ఉందని, 10 వేలకు పైగా కేసులు నమోదుకావొచ్చని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దేశంలోకి థర్డ్ వేవ్ ఎంటర్ అయిందని, పెరుగుతున్న కేసులో ఇందుకు నిదర్శనమని…
ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ బిగ్‌బాష్ టోర్నీలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే మెల్‌బోర్న్ జట్టులో 12 మంది కరోనా బారిన పడగా ఇప్పుడు మ్యాక్స్‌వెల్ 13వ వాడు కావడం గమనార్హం. ఆ జట్టులో 8 మంది సహాయక సిబ్బంది, నలుగురు ఆటగాళ్లకు…
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది… అయితే, కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉందంటూ ముందుగా పోటీపడి స్వదేశాలకు, సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి భారీగా ఖర్చు చేశారు.. ఆ సమయంలో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.. అన్ని దేశాలు ఆంక్షల బాట పడుతున్న సమయంలో.. విమానాలు ఎక్కేవారు లేక.. చార్జీలు తగ్గిపోయాయి.. ఇదే సమయంలో.. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు పడిపోయాయి.. సాధారణ సమయాల్లో దుబాయ్…
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే థర్డ్‌వేవ్ వచ్చినట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. వారం రోజుల తేడాలో దాదాపు 44 వేల కరోనా కేసులు పెరిగాయి. వారం క్రితం 13వేలు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం 58వేల మార్కుకు చేరుకున్నాయి. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు గత వారం రోజులుగా నమోదైన కేసుల…
దేశంలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుండటంపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి కరోనాకు టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. కరోనా మాత్రలను డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది. ఈ మేరకు అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన ‘మోల్నుపిరవిర్’ మాత్రల ధరలను డా.రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. 200 మిల్లీగ్రాముల మాత్రను రూ.35 చొప్పున విక్రయించనున్నట్లు డా.రెడ్డీస్ తెలిపింది. కరోనా…
అటు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ… ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు ఏపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. Read Also: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు..…