దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, అమలు చేస్తున్నారు. పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. సినిమా హాళ్లు బంద్ చేశారు. ఇక 50 శాతం సీటింగ్‌లో రెస్టారెంట్లు, మెట్రోలు నడుస్తున్నాయి. కార్యాలయాలు సైతం 50 శాతం మంది ఉద్యోగులతోనే నడుస్తున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఢిల్లీలో వేగంగా కేసులు పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలను కఠినం చేసేందుకు…
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతి…
బీహార్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాట్నాలోని నలందా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో పనిచేస్తున్న 87 మంది వైద్యులకు కరోనా సోకింది. కరోనా సోకివ వైద్యలుకు లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని, వారంతా ఆసుపత్రి క్యాంపస్‌లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. Read:…
తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. ఇక, ఎవ్వరినీ వదిలేదు అనే తరహాలో సామాన్యులు, నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు.. అధికారులు.. ఎవరైతే నాకేంటి అనే విధంగా.. అందరినీ టచ్ చేస్తోంది మాయదారి కరోనా.. తాజాగా, టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ…
జనవరి 1 వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు ఎలా అనుమతులు ఇస్తారని అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రతిరోజూ లక్షలాది మంది నుమాయిష్‌ను చూసేందుకు వస్తారని, కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తే వైరస్ మరింత తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంటుందని అనేక మంది ఫిర్యాదులు చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలపై ఇప్పటికే ప్రభుత్వం…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ తెలంగాణలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 32 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. Read Also: ప్రజల అజెండానే మా ఎజెండా: భట్టి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో… కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77, 486 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 497 కి…
కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్-నైనిటాల్ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్…
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. మూడు రోజుల కిందట ఢిల్లీలోని యాక్టివ్ కేసులు 2,291 ఉన్నాయని, ఇప్పుడవి 6,360కి పెరిగాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29న కొత్తగా 923 కరోనా…