ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విద్యార్థులకు, యువతకు ఎక్కువగా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్స్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడ పడమటలోని కోనేరు బసవయ్య చౌదరి స్కూల్ లో కరోనా కలకలం రేగింది. టీచర్ కు కరోనా పాజిటివ్ రావడంతో యాజమాన్యం మూడురోజులపాటు సెలవు ప్రకటించింది. పాఠశాలలో మొత్తం 1300 విద్యార్థులు, 40 మంది టీచర్లు ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన టీచర్…
చూస్తుండగానే కోవిడ్ 19 సెకండ్ వేవ్ అదుపు తప్పిపోవడం ఆందోళనకరంగా మారింది, రోజుకు రెండు లక్షల కేసులకు మించి నమోదవడం మొదటి దఫా పరిస్తితిని మించిపోయింది.కేసులు ఎక్కువగా వున్నా మరణాలు ఆ స్తాయిలో లేవని మొదట అనుకున్నారు గాని ఆ సంతోషం కూడా ఆవిరైపోయింది. మొదటి దఫాలో మరణాల రేటు 1.1 శాతం లోపే ఉండగా ఇప్పుడు 1.3 శాతం దాటిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. పైగా పెరుగుదల వేగం కూడా గతం కంటే చాలా ఎక్కువగా వుంది.గతంలో…
ఇండియాలో విజృంభణ దారుణంగా ఉంది. రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లిస్ట్ లో ఉన్నది. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. సెకండ్ వేవ్ లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో…
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్నది. మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది ఈ కుంభమేళాకు తరలివస్తుంటారు. కరోనా సమయంలో జరుగుతున్న కుంభమేళా కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కుంభమేళాలో వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది కుంభమేళాకు వచ్చిన భక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం కుంభమేళాపై కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లి…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఐదువేలు దాటిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇండియా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇండియాలో మరో వ్యాక్సిన్ కూడా రెడీ అయ్యింది. అయితే, ఇది అలోపతి కాదు, హోమియోపతి వ్యాక్సిన్. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియాలో హోమియోపతి వ్యాక్సిన్ తయారు చేసినట్టు లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్…
కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక, ఈనెల 21న రాజన్న…
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న ఆరువారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను…