ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఐదువేలు దాటిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.