తగ్గినట్టే తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కోవిడ్ రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ పైకి కదులుతోంది. అయితే, కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రెగ్యులర్ ఫ్లూస్‌తో లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం పెరిగింది.. గత వారం తెలంగాణలో 355 కేసులు, ఈ వారం 556 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో వారం రోజుల్లో 811 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. పాజిటివిటి రేటు 1 శాతానికి పెరిగిందని ప్రకటించారు.
Read Also: Face Book: ఫేస్‌బుక్‌లో కీలక మార్పులు.. మారనున్న టికర్, లోగో
అయితే, కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాలు సున్నాగా ఉన్నాయి.. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు కూడా లేవని స్పష్టం చేసింది వైద్య ఆరోగ్యశాఖ.. ఇక, వ్యాక్సినేషన్ కవరేజ్ 100 శాతం ఇచ్చుకున్నాం.. సబ్ వేరియంట్స్ కొంత ఇబ్బంది పెడుతున్నాయి.. కానీ, కరోనా మొత్తం ఎలిమినెట్ కాలేదు. వచ్చే డిసెంబర్ వరకు కరోనా ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపారు. కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకోవాలి.. మాస్క్ ధరించాలి.. భౌతిక దూరం పాటించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.