కరోనా మహమ్మారి వెలుగు చూసిననాటి నుంచి దానిపై అనేక అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మహమ్మారి సోకినవారిలో జరిగే పరిణామాలు.. కోవిడ్ నుంచి కోలుకున్నతర్వాత వచ్చే మార్పులు.. ఇలా అనేక రకాలుగా పరిశోధనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు.. అయితే, కోవిడ్ బారినపడిన తర్వాత చాలామంది పిల్లల్లో ప్రాణాంతక మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ) కనిపించినట్టు మరో కొత్త స్టడీ తేల్చింది. ఇది, వ్యాక్సినేషన్ వేసుకోని పిల్లలతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా కనిపించిందని చెబుతున్నారు..
Read Also: Mamata Banerjee: దేశంలో ప్రతిపక్ష నేతలకు లేఖ.. జూన్ 15న ఢిల్లీలో కీలక మీటింగ్
కరోనా వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ సోకిన తర్వాత అర మిలియన్ కంటే ఎక్కువ మంది చిన్నారులు, టీనేజర్లపై డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. అయితే, వీరిలో చాలామంది చిన్నారుల్లో ఎంఐఎస్‌సీ-సీ ఉన్నట్లు ఆ అధ్యయనం గుర్తించింది. ఆ వ్యాధిబారిన పడిన ప్రతి 12 మందిలో 11 మంది వ్యాక్సినేషన్ తీసుకోనివారుంటే.. టీకా తీసుకున్నవారు మాత్రం ఒక్కరే ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడులాంటి కీలక భాగాల్లో వాపు ఉంటుందని గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల్లో 34.9 రెట్లు, టీకా తీసుకున్న చిన్నారుల్లో 3.7 రెట్లు ఎంఐఎస్-సీ కేసులు గుర్తించినట్లు పరిశోధకులు జేఏఎంఏ పీడియాట్రిక్స్‌లో వెల్లడించారు.. డెల్టా వేరియంట్ ప్రబలంగా ఉన్నప్పుడు టీకా వేయని పిల్లల్లో మిలియన్‌కు 290.7 రెట్లు ఎంఐఎస్-సీ కేసులు, టీకా తీసుకున్న చిన్నారుల్లో మిలియన్‌కు 101.5రెట్లు ఎంఐఎస్-సీ కేసులు గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు..