
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక సమూహాల్లో వైరస్ మహమ్మారి వేగం మరింత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, కరోనా మహమ్మారి ఢిల్లీలోని తీహార్ జైలును వణికిస్తోంది. దేశంలోని వివిధ జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడుతున్నారు. రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా సోకిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, కరోనా సోకిన నలుగురు ఖైదీలు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో జైల్లో మిగతా ఖైదీలు ఆందోళన చెందుతున్నారు.