ఏపీలో 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74748 మందిని టెస్ట్ చేస్తే 14669 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. అలాగే 24 గంటల్లో 71 మరణాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. ఒకట్రోండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని… కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతించామన్నారు. 5572 ఐసీయూ బెడ్లల్లో 2570 బెడ్లు ఖాళీగా ఉన్నాయని..ఆక్సిజన్ బెడ్లు 7744 బెడ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 7643 జనరల్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని… బెడ్ల వివరాలు ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రియల్ టైంలో డేటా అప్డేట్ చేయనున్నామన్నారు. నిన్నటికి కోవాగ్జీన్ 65240 డోసులు, కోవీషీల్డ్ 134440 డోసులు అందుబాటులో ఉన్నాయని..ఇవాళ్టి డేటా రాత్రికి వస్తుందన్నారు. నిన్నటి డేటా ప్రకారం 75209 మంది హోం ఐసోలేషనులో ఉన్నారన్నారు.