కరోనా విలయం : తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా 200 టన్నుల ఆక్సీజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సా లోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సీఎం ను కోరారు. వ్యాక్సిన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు
Also Read
అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి తలకుమించిన భారంగా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణకోసం ఆక్సీజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని, ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఆదేశాలు జారీచేసినట్టుగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సీఎం కేసీఆర్ కు వివరించారు.
తాజావార్తలు
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!