కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. మొదటి విడత “వ్యాక్సిన్” తీసుకున్న తర్వాత “కరోనా” సోకినట్లయితే, “కరోనా” సోకిన నాటి నుంచి క్లినికల్ రికవరీ తర్వాత, 3 నెలల వరకు మలి విడత “వ్యాక్సిన్”వాయిదా వేయాలని తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో అసుపత్రులలో చికిత్స పొందిన “కరోనా” యేతర పేషెంట్లు కూడా, రికవరీ తర్వాత, 4 నుండి 8 వారాల పాటు టీకా తీసుకోవడం కోసం వేచి ఉండాలి. “కోవిడ్-19” సోకిన వ్యక్తి “వ్యాక్సిన్” తీసుకున్నా, లేదా RT-PCR నెగెటివ్ గా వచ్చిన 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే మహిళలకూ టీకాలు సిఫార్సు చేసారు. టీకా ఇవ్వడానికి ముందు “రాపిడ్ యాంటిజెన్ టెస్ట్”ద్వారా టీకా గ్రహీతలను పరీక్షించాల్సిన అవసరం లేదు అని పేర్కొంది.