దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలి. కరోనా రోగి తుమ్మినప్పుడు అతని తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రసరిస్తాయి. అదే విధంగా మైక్రో తుంపర్లు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఏ వ్యక్తికి ఎప్పుడు కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి బారినుంచి కోలుకుంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. పెళ్ళైనా వారు, పెళ్లి కానివారు, పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్దమైన వారు ఇలా ఎవర్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. మరో మూడు రోజుల్లో పెళ్లి ఉందని అనగా, పెళ్లి కుమారుడు కరోనాతో బలయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది. సాలూరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి…
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు ఎక్కువే అవుతున్నాయి. కాగా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన వంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు. 25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమర్జెన్సీ గా ఉందని ఆజాద్…
రోనా నిర్ధారణ పరీక్షలు మరింత సులువుగా.. ఇంటి దగ్గరమే స్వయంగా చేసుకునే వెసులుబాటు వచ్చేస్తోంది… కరోనా టెస్ట్ చేయించుకోవాలంటూ.. స్థానికంగాఉన్న పీహెచ్‌సీకో.. ప్రభుత్వ ఆస్పత్రిలో వెళ్లి గంటల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేదు.. ఇక, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. ర్యాపిడ్ టెస్ట్.. ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐసీఎంఆర్.. ఈ కిట్లు మరో రెండు మూడు రోజుల్లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు..…
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,660 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 4,826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263కు పెరగగా.. రికవరీలు 4,95,446గా చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 3060 మంది మృతి చెందగా.. ప్రస్తుతం 45,757 యాక్టివ్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 22,610 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య.. 114 కు పెరిగింది.. ఇదే సమయంలో 23,098 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య…
కరోనా ఫస్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మహమ్మారి బారినపడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.. తల్లిదండ్రులను కోల్పోయి.. చిన్నారులు అనాథలుగా మిగిలిపోయినవారు ఎంతోమంది.. అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భరోసా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని లేఖ రాసిన ఆమె… అనాథలైన చిన్నారులకు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో ఎక్కువ మందిని కరోనా అతలాకుతలం చేసింది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడ్డారు.. అందులో ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలారు.. తాజాగా, లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్ఖా సింగ్ కోవిడ్ బారినపడ్డారు.. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది.. ఆయన వయస్సు 91 ఏళ్లు..అయితే, ఆయన పరిస్థితి నిలకడగానే ఉండడంతో.. చండీగఢ్ సెక్టార్…
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితం కావడంతో జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తారని అనుకున్నారు. కరోనా మహమ్మారి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపించాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. పోయిన ఉద్యోగాలపై దృష్టి సారించారు. దీంతో 2020లో జననాల రేటు తగ్గింది. 2019 లో అమెరికా మొత్తం మీద 37.5 లక్షల మంది…