కరోనా మహామ్మారిని ఎదుర్కోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మెడిసిన్ ఇప్పుడు సంచటనంగా మారగా, తెలంగాణలో మంథనీకి చెందిన గోశాల నిర్వాహకులు రమేష్ సరికొత్త ప్రయోగం చేశారు. అడవిలో తిరిగే అవుల నుంచి సేకరించిన ఆవుపేడ పిడకలు, నెయ్యి, ఆవాలు, కర్పూరం, పసుపు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పోగను గదిలో వేయడం వలన గదిలో ఉన్న కరోనా వైరస్ చనిపోతుందని, గాలిలో ప్రాణవాయువు పెరుగుతుందని అంటున్నాడు రమేష్. ఈ ప్రయోగం మంథనీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కార్యాలయంలో నిర్వహించారు.