భారత్ లో కొనసాగుతున్న రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా 9వ రోజు 3 లక్షలలోపు రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య నమోదయింది. అయితే.. పాజిటివ్ కేసులు తగ్గినా…“కరోనా” మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,96,427 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,48,874 కి చేరింది. ఇందులో 2,40,54,861 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,86,782 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,511 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,07,231 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,26,850 మంది కరోనా నుంచి కోలుకున్నారు.