ఈరోజు నుంచి ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆనందయ్య మందును నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయబోతున్నారు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు మందును సరఫరా చేయనునున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ జరగడంలేదని, అక్కడికి ఎవరూ రావొద్దని ఇప్పటికే అధికారులతో పాటు మందు తయారు చేస్తున్న ఆనందయ్య కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోకి బయట ప్రాంతాల వారిని అనుమతించడంలేదు. గతనెల 21 వ…
ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఫైర్ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో, వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. కరోనా వస్తే పారాసేటమాల్, బ్లీచింగ్ సరిపోతుందని జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే ఏపీ ప్రమాదంలో పడిందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా హాస్పిటల్స్ కు వెళ్లి పేషంట్లకు ధైర్యం చెబుతున్నారని తెలిపారు. మన ముఖ్యమంత్రి నాలుగు గోడల నుండి బయటకు రావడంలేదని..ఒక ప్రజా ప్రతినిధిగా ప్రాణాలు…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్రధాన్యత ఇస్తున్నారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతున్నది. 17 లక్షల మంది జనాభా కలిగిన నగరంలో కేవలం ఇప్పటి వరకు 3.08 లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే జనాభాలో 20శాతం…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా వ్యాక్సిన్‌లను పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి వ్యాక్సిన్‌లను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హై ఎక్స్ పోజర్ కేటగిరీలో ఉన్న 12…
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుచి, వాసను కోల్పోవడం, శ్వాసక్రియలు తీసుకోవడంలో ఇబ్బందు పడటం, జ్వరం, జలుబు వంటివి కరోనా లక్షణాలుగా చెబుతుంటారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా, మానసికంగా అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. దీని నుంచి సాధ్యమైనంత వరకు బయటపడాలని, లేదంటే, అది మెదడుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీకి చెందిన నిపుణులు మెదడుపై కరోనా ప్రభావం ఎలా…
కర్నూలు జిల్లాలో కరోనాతో చనిపోయిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇదే వాస్తవమని తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలో 1,12,956 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,12,575 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వైరస్ సోకినవారిలో 751 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 3,630 వున్నాయి. అయితే కరోనా బారిన పడినవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 2వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం మృతులు…
ఇంకా అనుకున్న స్థాయిలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్రభుత్వం.. ఇప్పటి వరకు లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండగా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది సర్కార్.. కోవిడ్ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ సడలింపులు…
లాక్‌డౌన్ చర్యలు క్రమంగా కరోనా కేసులు తగ్గేలా చేస్తున్నాయి.. తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో.. 3,821 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు…