కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేరళ.. గతంలో ఇచ్చిన సడలింపులు యథావిథిగా కొనసాగుతాయని ప్రకటించింది.. కేరళలో ఇంకా భారీగానే కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. దీంతో.. ఈ నెల 16వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినట్టు లెఫ్ట్ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈనెల 12, 13 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.. ఈ సమయంలో నిత్యావసరాల షాపులు, పరిశ్రమలకు ముడిపదార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు బ్యాంకులు…
తెలంగాణలో కరోనా రోజువారి కరోనా కేసులు రెండు వేల దిగవకు చేరుకున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంట్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 16 మంది కరోనా పొట్టనబెట్టుకుంది.. ఇదే సమయంలో .. గడిచిన 24 గంటల్లో 3,527 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.…
రాష్ట్రాల ఒత్తిడి, సుప్రీం కోర్టు అక్షింతలు అన్నిటినీ మించి దేశప్రజలలోపెరిగిన అసంతృప్తి కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ వాక్సిన్‌పై కొత్తప్రకటన చేయాల్సి వచ్చింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ 11 మంది బిజెపియేతర ముఖ్యమంత్రులకు లేఖ రాస్తూ వాక్సిన్ బాధ్యత ఖర్చు పూర్తిగా కేంద్రమే తీసుకునేలా ఒత్తిడి చేయాలని కోరారు. మామూలుగా మోడీతో సఖ్యతగా సానుకూలంగా వుండే ఒరిస్సాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎపి ముఖ్యమంత్రి జగన్ కూడా మరో భాషలోనైనా సరే కేంద్రం మొత్తం బాధ్యత…
కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.. ఇక రూ. 500 కోట్లతో అన్ని మున్సిపాలిటీలలో మార్కెట్లు సిద్ధం చేశామన్న ఆయన.. మెట్ పల్లిలో 2.57 కోట్ల రూపాయలతో వెజ్ ఆ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేశామని.. 138 మున్సిపాల్టీల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. మున్సిపాలిటీలకు ప్రతి నెలా…
ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆధునిక కాలంలో ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు.. గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అన్నారు. కరోనాతో దేశప్రజలు ఎంతో బాధ అనుభవించారన్న ఆయన.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదన్నారు.. ఈ సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని వెల్లడించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్…
తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిని మూసేశారు. రాష్ట్రాలకు అదాయాన్ని అందించే మద్యం దుకాణలు సైతం మూతపడ్డాయి. గత నెల రోజులుగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో మందు షాపులు తెరుచుకోలేదు. దీంతో కొంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. మందుబాబుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. క్వార్టర్ మందును ఏకంగా రూ.800 కి అమ్ముతున్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు…
దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్పతి చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రయ కూడా వేగంగా సాగుతున్నది. విదేశాలకు చెందిన వ్యాక్సిన్‌లు ఇండియాకు రాబోతున్న తరుణంలో ప్రధాని మోడి జాతినుద్దేశించి మాట్లాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతి నుద్దేశించి ప్రసంగించబోతున్నారు. కరోనా మహమ్మారి, వ్యాక్సినేషన్ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు…
కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో పరీక్షలను రద్ధు చేస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్ధు చేస్తు వస్తున్నారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను రద్ధు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో పుదుచ్చేరి కూడా చేరింది. విద్యార్ధులకు కీలకమైన ఇంటర్ పరీక్షలను నిర్వహించే అవకాశం కోసం ఇప్పటి వరకు ఎదురుచూశామని, కానీ, కరోనా కారణంగా ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదని, దీంతో పరీక్షలను రద్ధుచేస్తూ నిర్ణయం…
గత నెలన్నరగా ఢిల్లీలో లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయి. వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీలో 50 శాతం కెపాసిటీతో అనుమతులు మంజూరు చేశారు. ఉదయం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. 50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి-బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975 కి చేరింది. ఇందులో 2,71,59,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,01,609 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2427 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,49,186 కి చేరింది. ఇక ఇదిలా…