కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. అయితే ఈ కరోనా వైరస్ భార్య, భర్తల బంధాన్నే మంట కలుపుతోంది. అవును.. కరోనా వస్తే.. భార్యనే వేలేశాడు ఓ భర్త. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. కరోనా సోకిన భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగు దొడ్డిని కూడా వాడకూడదని హెచ్చరించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని గోపాలవాడలో మేడి నర్సమ్మ,పెద్దయ్య అనే కుటుంబం…
ట్రంప్ ఒటమికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఒకకారణమైతే, ప్రధాన కారణం మాత్రం కరోనా మహమ్మారినే అని చేప్పాలి. కరోనాను కంట్రోల్ చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని అమెరికా ప్రజలు విమర్శలు చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించిన ట్రంప్, కరోనా కట్టడిలో విఫలం అయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ట్రంప్ చైనాపై అనేకమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుంచే అమెరికాకు వచ్చిందని, ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం కావడానికి చైనానే…
కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే వారి త్యాగాన్ని అందరికి తెలియజేయాలని భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వైద్యులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని భావించిందట. ఇందులో భర్త రామ్‌చరణ్‌ని హీరోగా…
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా…
కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు వదిలారు.. ఇక, సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదు అయ్యింది.. ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు.. కొందరు రాజకీయ పార్టీల నేతలను కూడా కరోనా ప్రాణాలు తీసింది.. ఇవాళ టీఆర్‌ఎస్ నేత, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్… ఇవాళ ఉదయం మరణించారు.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
వ్యాక్సిన్ల విషయంలో క్రమంగా రాష్ట్రాలను కదులుతున్నాయి… కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్‌లకు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాలని కోరారు వైఎస్…
తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు…
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి హజ్ యాత్ర రద్దు చేశారు.. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో.. గత ఏడాది హజ్‌యాత్రను రద్దు చేసిన ఇండోనేషియా.. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో.. వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసింది. కోవిడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్లడించారు.. సౌదీ అరేబియా సైతం హజ్‌కు…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జి.హెచ్.యం.సి పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బాగంగా 2 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ ను అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. High exposure గ్రూపులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం క్యాబ్, ఆటో, వ్యాక్సినేషన్ సెంటర్ ను తనిఖీచేశారు.…