లాక్‌డౌన్ మళ్లీ పొడిగింపు.. మరికొన్ని మినహాయింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకా అనుకున్న స్థాయిలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్రభుత్వం.. ఇప్పటి వరకు లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండగా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది సర్కార్.. కోవిడ్ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ సడలింపులు ఇస్తున్నారు.. పశ్చిమ మరియు డెల్టా ప్రాంతంలో 11 జిల్లాల్లో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.. ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తారు.. ఇక, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్లు, సెలూన్లు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మూసివేయబడతాయి.
కోయంబత్తూర్, ది నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం మరియు మాయిలాదుత్తురైలకే సడలింపులు పరిమితం అవుతాయని తన ప్రకటనలో పేర్కొన్నారు సీఎం స్టాలిన్.. తమిళనాడు అంతటా.. నిత్యావవసరాలకు అవసరమైన షాపులు, చేపలు మరియు మాంసం స్టాల్స్ ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య అనుమతించబడతాయి. కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్మే షాపులను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటాయి.. చేపల మార్కెట్లలో మరియు కబేళాలలో హోల్‌సేల్ వ్యాపారం మాత్రమే అనుమతించబడుతుంది. భౌతిక దూరం ఉండేలా జిల్లా యంత్రాంగం ఒకటి కంటే ఎక్కువ చోట్ల బహిరంగ హోల్‌సేల్ మార్కెట్లకు ఏర్పాట్లు చేసింది. ఇక, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితో పనిచేస్తాయి. మ్యాచ్ బాక్స్ పరిశ్రమలు 50 శాతం కార్మికులతో పనిచేస్తాయి.. అపార్ట్ మెంట్ల కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు హౌస్ కీపింగ్ సేవలను ఇ-రిజిస్ట్రేషన్‌లో అనుమతిస్తారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్ మరియు మోటారు టెక్నీషియన్లు, వడ్రంగులు ఈ-రిజిస్ట్రేషన్‌లో ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య పని చేయవచ్చు.. ఎలక్ట్రికల్ వస్తువులు, బల్బులు, కేబుల్స్, స్విచ్‌లు మరియు వైర్లు విక్రయించే దుకాణాలను ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య అనుమతిస్తారు. సైకిల్ మరియు ద్విచక్ర వాహన వర్క్‌షాప్‌లు, హార్డ్‌వేర్ షాపులు, మోటారు విడిభాగాల అమ్మకందారులు, స్టేషనరీ దుకాణాలు, ట్రావెల్ ఆపరేటర్ల వాహన మరమ్మతు దుకాణాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పనిచేసుకోవచ్చిని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!