కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో కేవలం 316 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 41 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 521కు పెరిగింది.. యాక్టివ్ కేసులు…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్ మూడో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్ వేవ్‌లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు.. మరోవైపు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్..…
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు చర్చాంశనీయంగా మారింది. అయితే మొదట ఈ ముందుకు బ్రేక్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్నటి నుండి మందు పంపిణి ప్రారంభించారు. అయితే తాజాగా కడపలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీకి బ్రేక్ పడింది. వనమూలికలు, తేనే, ముడి సరుకు నిర్వాహకులు సిద్దం చేసుకున్నారు. అయిన ఆనందయ్య శిష్యులు నేడు రాకపోవడంతో మందుల తయారీ, పంపిణీ వాయిదా వేసినట్లు…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 86,498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది. ఇందులో 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,03,702 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2123 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309 కి చేరింది. ఇక ఇదిలా…
సెకండ్ వేవ్ ప్రభావం యువతపై ఎక్కువ పడిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపితే, సెకండ్ వేవ్ యువతపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మూడో వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, మూడో వేవ్ ఎఫెక్ట్ ఏ వయసువారిపై అధికంగా ఉంటుంది అనే విషయంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడోదశ కరోనా…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో దిగువకు చేరుకుంటోంది. అత్యంత వేగంగా గ్రాఫ్ కిందికి పడిపోతోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్ లాక్ దిశగా నిర్ణయాలు తీసేసుకున్నాయి. దీంతో, జనజీవనం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఇప్పటికే అన్ లాక్ మొదలైంది. ఢిల్లీలోనూ ఆంక్షలు సడలించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ మాత్రమే వుండే అవకాశం కనిపిస్తోంది. ఇక యధావిధిగా ప్రజాజీవనం ఉండేలా…
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మూడో విడత లాక్‌డౌన్ గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. దీంతో తదుపరి కార్యాచరణ కోసం కేబినెట్ మరోసారి సమావేశమవుతోంది. లాక్ డౌన్ సడలింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్‌లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని…
కరోనా కట్టడి కోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్.. అయితే, కేంద్రం వ్యాక్సినేషన్ విధానంపై ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు.. ఓవైపు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు, ప్రతిపక్షాల డిమాండ్లు, ఇంకోవైపు సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. దీంతో కేంద్రం దిగిరాకతప్పలేదు.. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అంటూ.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.. రాష్ట్రాలు ఒక్కరూపాయి కూడా వ్యాక్సిన్లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని.. 75 శాతం రాష్ట్రాలకు సరఫరా చేస్తే.. 25…