కర్నూలు జిల్లాలో కరోనాతో చనిపోయిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇదే వాస్తవమని తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలో 1,12,956 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,12,575 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వైరస్ సోకినవారిలో 751 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 3,630 వున్నాయి. అయితే కరోనా బారిన పడినవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 2వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం మృతులు 741 మంది కాగా, ఇందులో 516 మంది పురుషులు ఉన్నారు. మహిళలు 225 మంది ఉన్నారు. కరోనా మృతుల్లో సుమారు 70% మంది పురుషులు, 30% మంది మహిళలు ఉన్నారు.