ఈరోజు నుంచి ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆనందయ్య మందును నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయబోతున్నారు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు మందును సరఫరా చేయనునున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ జరగడంలేదని, అక్కడికి ఎవరూ రావొద్దని ఇప్పటికే అధికారులతో పాటు మందు తయారు చేస్తున్న ఆనందయ్య కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోకి బయట ప్రాంతాల వారిని అనుమతించడంలేదు. గతనెల 21 వ తేదీ నుంచి మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయి సంగతి తెలిసిందే.