కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుచి, వాసను కోల్పోవడం, శ్వాసక్రియలు తీసుకోవడంలో ఇబ్బందు పడటం, జ్వరం, జలుబు వంటివి కరోనా లక్షణాలుగా చెబుతుంటారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా, మానసికంగా అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. దీని నుంచి సాధ్యమైనంత వరకు బయటపడాలని, లేదంటే, అది మెదడుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీకి చెందిన నిపుణులు మెదడుపై కరోనా ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంపై పరిశోధలు చేయగా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కరోనా మెదడుపై ప్రభావం చూపుతుందని తెలింది.